ప్రభుత్వ వసతిగ్రుహం లో వైద్య శిభిరం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం లోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ ఆద్వర్యంలో పట్టణంలోని బిసి బాయ్స్ హాస్టల్ లో గురువారం నాడు వైద్య శిభిరం నిర్వహించారు.ఈ వైద్య శిభిరం లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత,పరిసరాల పరిశుభ్రత,సీజనల్ వ్యాధుల నివారణ పై అవగాహన కల్పించి,జ్వరపీడితుల నుండి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపి వారికి మందులను అందజేశామని తెలిపారు.ఈ శిభిరం లో ఎచ్ ఈ ఓ లక్ష్మణ్ స్వామి,హాస్టల్ వార్డెన్ పెండెం శ్రీహరి,ఎమ్ ఎల్ ఎచ్ పి మౌనిక ,హెల్త్ అసిస్టెంట్ లు,యం.ఏ.గఫూర్,ఇసాక్ అహ్మద్,ఏ ఎన్ ఎమ్ చిలకమ్మ, ఆశావర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking