ఎస్సై ని సన్మానించిన మూగజీవుల సేవా సంఘం సభ్యులు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 21 : ప్రపంచంలో ఇమిడి ఉన్న ప్రకృతిలోని విశాల పర్యావరణంలో భూమి మీద జీవించే 84 లక్షల జీవ రాశులలో మనిషి ఒక జీవి.మిగతా జీవరాసులతో పోలిస్తే మనిషి మాట్లాడగలిగే జీవిగా జీవనాన్ని కొనసాగిస్తూ,విచక్షణ జ్ఞానం కోల్పోతూ ప్రకృతి పర్యావరణం వనరుల విధ్వంసానికి, మూగజీవులు అంతరించిపోవడానికి మూలకారణమవుతున్నాడని అధ్యక్షుడు కటకం నాగరాజు అన్నారు.మనిషి తాను సౌకర్యవంతమైన జీవనం గడిపేందుకు తాను కూర్చున్న కొమ్మనే నరుక్కునే పరిస్థితి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసారు.భూమ్మీద అంతరించిపోతున్న మూగజీవుల పరిరక్షణ కొరకు ఒక మంచి దృఢ సంకల్పంతో కొంతమంది సభ్యులము కమిటీగా ఏర్పడి రామకృష్ణాపూర్ పట్టణ కేంద్రంగా మూగజీవుల సేవా సంఘంను నెలకొల్పడం జరిగిందని అన్నారు. మూగజీవుల సేవా సంఘంను ఏర్పాటు చేసినప్పటినుండి కొంతమంది దాతలు సహృదయంతో చేసిన ఆర్థిక సహాయంతో అన్యాక్రాంతంగా రోడ్లపై దిక్కులేని పరిస్థితుల్లో నిస్సహాయంగా ఆహారం దొరకక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆవులు కుక్కలు, కోతులు,పక్షులు మొదలగు వాటికి ప్రతిరోజు ఆహారాన్ని అందించి వాటి ఆకలి తీర్చడం జరుగుతుందన్నారు. మూగజీవులపట్ల జాలి కలిగి ఉండి వాటిని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుచేశారు.ఈ సంఘం ఏర్పాటు చేసినప్పటి నుండి రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది మూగజీవుల రక్షణ కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నందుకుగాను, మూగజీవుల సేవా సంఘం తరపున రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ రెడ్డిని కమిటీ సభ్యులతో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కటుకం నాగరాజు,ఉపాధ్యక్షుడు మర్రి స్వామి,ఆర్గనైజింగ్ సెక్రటరీ వేముల హరిప్రసాద్, కోశాధికారి తిరుమలశెట్టి రమణరావు, పానుగంటి శ్రీనివాస్,సన్నీ, శ్రీనివాస్,యాంటీ కరెప్షన్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సంగెం శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking