మధ్యాహ్న భోజనాన్ని మెనులో పొందుపరిచిన విధంగా తప్పకుండా అమలు చెయ్యాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్

సిద్దిపేట 21 డిసెంబర్ 2023

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని మెనులో పొందుపరిచిన విధంగా తప్పకుండా అమలు చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. తెలంగాణ మాడల్ స్కూల్ హుస్నాబాద్ లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే విషయాన్ని కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు ఈ మద్య వాగ్వాదం జరిగిన విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళగా గురువారం మాడల్ స్కూల్ సందర్శించి క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్, విద్యార్థులతో మాట్లాడారు. మెను ప్రకారం భోజనం పెట్టలేదనే విషయాన్ని కలెక్టర్ గ్రహించి వంట చేసే ఏజెన్సీ వారిని అడగ్గా మార్కెట్లో దొరికిన కురగాయాలను వండు తున్నానని వంటమనిషి భాగ్యలక్ష్మి కలెక్టర్ కి చెప్పగా ఆగ్రహం తో మెను ప్రకారం నాణ్యమైన పద్ధతిలో వండాలనుకుంటే మాత్రమే చెయ్యండి లేకపోతే ఏజెన్సీ ని మార్చాలని ప్రిన్సిపాల్ అన్నపూర్ణ కి తెలిపారు. ఇలా జరుగుతున్న సంఘటనల గుర్చి డిఈఓ, ఎంఈవో, ప్రిన్సిపాల్ విచారణ జరపాలని, ఎంఈఓ తరచు పర్యవేక్షణ చేసి ఇలాంటి పరిస్థితి మళ్లీ పూనారావృతం కాకుండా చూసుకోవాలని అన్నారు.

రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హుస్నాబాద్ పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు, ఆర్టీఏ కార్యాలయల భవనాల నిర్మాణాలకు సరిపడే స్థలాన్ని అన్వేషణ చెయ్యాలని హుస్నాబాద్ తహసీల్దార్ రవీందర్ రెడ్డి కి తెలిపారు.
హుస్నాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యలయంలో మంత్రి నివసించేందూకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. మంత్రి నివాసం చుట్టూ ఉన్న గవర్నమెంట్ భూమి విచారణ జరిపి చుట్టు ప్రహరీ గోడ పెట్టాలన్నారు

 

Leave A Reply

Your email address will not be published.

Breaking