నేడు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 25 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటన వివరాలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా ఉదయం 10గంటలకు ఉమ్మడి ఖమ్మంజిల్లా ఇన్ చార్జ్ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన పై సమీక్ష, విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 4గంటలకు వరంగల్ జిల్లా ఇన్ చార్జ్ మంత్రిగా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలతో కలిసి వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన పై సమీక్ష, విలేకరుల సమావేశంలో పాల్గొంటారు

Leave A Reply

Your email address will not be published.

Breaking