ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 29 (ప్రజాబలం) ఖమ్మం మెడికల్ కాలేజీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ద్రుమతారు కన్సల్టెన్సీ వారు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వర రావుని కలిసి, ఖమ్మం జిల్లాలో చేపట్టే మెడికల్ కాలేజీ శాశ్వత భవన నిర్మాణాల గురించి వివరించడం జరిగింది ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మెడికల్ కళాశాలలో మొదటి విద్యా సంవత్సరము ఆరంభించ బడినందున ఈ నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని, అదే విధంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మెడికల్ కళాశాల నిర్వహణకు పాత కలెక్టరేట్ భవనాన్ని వాడుతున్నరని, కొత్త భవన నిర్మాణానికి 5 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నదని మెడికల్ కళాశాల భవనము వసతి గృహము, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టుచున్నామని సంస్థ ప్రతినిధులు తెలుపగా, జిల్లా కలెక్టర్, ఖమ్మంని సంప్రదించి, భవిష్యత్తు అవసరాలకు సరిపడ నిర్మాణాలు అనగా రెసిడెంట్ డాక్టర్స్ భోధన సిబ్బంది వసతి గృహాలు, మెడికల్ కాలేజీ అనుబంధ భవన నిర్మాణాలు, వీటన్నిoటినీ పరిగాణలోనికి తీసుకొని అందుబాటులో ఉన్న స్థల వైశాల్యమును బట్టి పుర ప్రముఖుల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకొని ఆధునిక హంగులతో విశాల ప్రదేశంలో నిర్మాణం జరగాలని, రాష్ట్రంలోని ఒక ప్రముఖ వైద్య కళాశాలగా ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలను రూపొందించాలని నిర్మాణ సంస్థ ని ఆదేశించడం జరిగింది