లహరి స్లీపర్ ఏసీ,నాన్ ఏసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 27 : మంచిర్యాల ఆర్టీసీ డిపోకు కొత్తగా మంజూరైన లహరి స్లీపర్ ఏసీ,నాన్ ఏసీ బస్సులను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.శనివారం ఆర్టీసీ డిపోలో పూజలు చేసి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ…మంచిర్యాల ప్రయాణీకులకు కొత్త బస్సులు సౌకర్యంగా ఉంటాయని అన్నారు.ఆర్టీసీ డిపోలో పనిచేసే మహిళలకు ప్రత్యేక విశ్రాంతి గది నిర్మించాలని డిపో మేనేజర్ ను ఆదేశించారు.ఆర్టీసీ లో స్థానికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ను ప్రజలు తిరస్కరించినా ఇంకా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోయడం శోచనీయమన్నారు.బీ ఆర్ ఎస్ నేతలు పద్ధతులు మార్చుకోకపోతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జాప్యం చేయడం లేదని తెలిపారు. రోజు తాగునీరు సరఫరా చేస్తున్నామని కొన్ని సమస్యలు ఉన్నా వాటిని కొద్దిరోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులాగా హామీలు ఇచ్చి మాట తప్పనని స్పష్టం చేశారు.100 ఫీట్ల రోడ్, ఓవర్ బ్రిడ్జి హామీలు ఏమయ్యాయని నిలతీశారు. సీఎం.రిలీఫ్ ఫండ్ ఇప్పటికి అనేక మందికి ఇప్పించానని మరికొన్ని మంజూరుకానున్నాయని తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకువెళ్లాడాని విమర్శించారు.ఎన్నికల ముందు 8,600 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల కు చెల్లించి కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.కేసీఆర్ లాగా హామీలు ఇచ్చి మాటతప్పే నైజం కాంగ్రెస్ డి కాదని అన్నారు. ఆరు హామీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.ఉచిత బస్సు ప్రయాణం పథకం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ రవీంద్రనాథ్, అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking