ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయాలలో అవకాశాలు ఉండాలి
అవకాశం ఇస్తే ఖమ్మం జిల్లా రూపు రేఖలు మారుస్తా
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 23 (ప్రజాబలం) ఖమ్మం
ఎంపి అభ్యర్దిగా బోనకల్ మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతు బిడ్డ గ్రామీణ వైధ్యుదు షేక్ మహమ్మద్ రసూల్ ఖమ్మం పార్లమెంట్ బరిలో దిగుతున్నారు.గ్రాడ్యుషన్ పూర్తిచేసి ప్రస్తుతం ఖమ్మం జిల్లా రఘునాధ పాలెం మండలంలో గ్రామీణ వైధ్యునిగా సేవలంది స్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని అగ్రవర్ణాల వారికి బడా కాంట్రాక్టర్లు వ్యాపారవేత్తలకే ప్రాధాన్యత ఇస్తూ టిక్కేట్లు కేటాయిస్తున్న నేపధ్యంలో ప్రజల సమస్యలు తెలిసినవాడిగా సామాన్యులు సైతం పార్లమెంట్ కి వెళ్ళేందుకు అవకాశాలు ఉండాలని ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి బరిలో దిగుతున్నానని తెలిపారు.తనకు ఖమ్మం ఎంపి గా అవకాశం ఇస్తే పేద మధ్యతరగతి వర్గాలకు శాశ్వత ఉపాధి అవకాశాలు కల్ఫిస్తానని ఖమ్మంలో యూనివర్సిటీ మరియు నాణ్యమైన విధ్యను అంధించే విదంగా నవోదయ కేంద్రీయ విధ్యాలయాలు తరహాలో ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ విధ్యా సంస్థ ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.సామాన్యుడు సైతం పార్లమెంట్ లో ప్రజల తరపునా గళం విప్పాలని ఆ అవకాశం కోసం ఖమ్మం ఎంపి బరిలో పోటీ చేస్తున్నానని మీడీయాతో తెలిపారు.దేశ వ్యాప్తంగా మైనార్టీలకు రాజకీయాలలో సరైన ప్రాతినిధ్యం కల్ఫించటం లేదని ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ముస్లీం మరియు క్రిస్టియన్ మైనార్టీలు తనకు ఆండగా ఉంటారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజల ఓటర్ల తరపునా నాకు మద్ధతు ఉంటుందని అశాభావం వ్యక్తం చేశారు