వాహనదారులు నిబంధనలు పాటించాలి

 

53 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలింపు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

జమ్మికుంట ప్రజబలం ప్రతినిధి జూలై 9

జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జమ్మికుంట పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టి నెంబర్ ప్లేట్ లేని వాహనాలను మైనర్లు నడిపిన వాహనాల తోపాటు ట్రిపుల్ రైడ్ చేసిన వాహన దారులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు . 53 ద్విచక్ర వాహనాల ను పోలీసులు తనిఖీల్లో పట్టుకొని స్టేషన్ కు తరలించగా హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి వాహనదారుల తో మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పకుండా నెంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని నెంబర్ ప్లేట్ల పైన అనవసరమైన రాతలు రాయకూడదని వాహనదారులకు సూచించారు. దానితోపాటు మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేయబడతాయని అంతేకాకుండా భారీగా జరిమానా విధించాల్సి వస్తుందని తెలిపారు. ఒక్కొక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారని. ఇది చట్ట వ్యతిరేకమని.ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రైడ్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి. తెలిపారు. అంతేకాకుండా వాహనదారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని పోలీసులకు మీరు కూడా సహకరించాలని చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందని ఏసీపీ శ్రీనివాస్ జి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వరగంటి రవి. ఎస్సై రాజేష్. మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking