కాలభైరవ స్వామిని దర్శించుకున్నఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 9 :

చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పారుపల్లిలోని శ్రీ కాలభైరవ స్వామివారిని గురువారం పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ కాలభైరవ స్వామి క్షేత్రం మన ప్రాంతానికి ఎంతో ప్రత్యేకమైనదని . ఇక్కడికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధి కోసం నా వంతు సహకారం అందించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు. ఈ ప్రాంత ప్రజల సుఖసంతోషాలతో క్షేమంగా ఉండాలని దేవున్ని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా భక్తులు, గ్రామస్తులు ఎంపీకి ఆత్మీయ స్వాగతం పలికి, ఆలయ అభివృద్ధి కోసం ఆయన తీసుకుంటున్న చొరవను ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking