సిద్దిపేట నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్., మేడమ్
ప్రజాబలం ప్రతినిధి:ఈరోజు సిద్దిపేట్ నూతన పోలీస్ కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి డాక్టర్ బి. అనురాధ ఐపీఎస్., మేడమ్ . ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు అందె శ్రీనివాసరావు, ఎస్ మల్లారెడ్డి, ఏ ఆర్ అడిషనల్ డీసీపీలు రామ్ చందర్రావు, సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, గజ్వేల్ ఏసిపి రమేష్, హుస్నాబాద్ ఏసిపి సతీష్, ఎస్బి ఏసిపి రవీందర్ రాజు, ట్రాఫిక్ ఏసిపి ప్రసన్నకుమార్, సిఐలు ఎస్‌ఐలు మరియు ఏఓ యాదమ్మ కమిషనర్ కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా మేడమ్ గారిని కలసి మొక్కలను అందజేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీలు ఏసీపీ లతో సమీక్ష నిర్వహించి జిల్లా భౌగోళిక పరిస్థితులు ఏ తరహా నేరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.
పోలీస్ కమిషనర్ మేడం గారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్,ని కలిసి మొక్కను అందజేశారు
సిద్దిపేట ప్రిన్సిపల్ డిస్టిక్ అండ్ సెషన్స్ జడ్జ్ డాక్టర్ టి. రఘురామ్ , గారిని మర్యాదపూర్వకంగా కలసి మొక్కను అందజేశారు