మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ పై దృష్టిపెట్టాలి.

 

ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించాలి – ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవాలి.

కుక్కల దాడులు అరికట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.

సంగారెడ్డి పట్టణ శానిటేషన్ పరిస్థితి పై ఆగ్రహం.

…..కలెక్టర్ క్రాంతి వల్లూరు .

సంగారెడ్డి జులై 11 ప్రజ బలం ప్రతినిధి : డి అశోక్.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శానిటేషన్ పరిస్థితి పై జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆగ్రహం వ్యక్తం చేశారు . గురువారం క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్ , జిల్లా పశు సంవర్థక శాఖఅధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు, ప్రధాన కూడలల్లో, చర్చి సమీపంలోని వార్డులలో ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోవడం పై కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలో శానిటేషన్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఉదయమే వార్డులో పర్యటించాలన్నారు. వార్డులో పర్యటించి ప్రజలతో సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. తాగునీటి సమస్యలు, పారిశుద్ధ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. పారిశుద్ధ్య ఆటోలు పట్టణంలోని అన్ని వార్డులు కవర్ చేయాలని, ప్రతి వార్డుకు ఆటోలు తీరగాలన్నారు. ప్రతి ఇంటి నుండి తడి పొడి చెత్త వేరుచేసి సేకరించాలన్నారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని అధికారులు ఆదేశించారు . ఇంటింటికి తిరిగి చెత్త సేకరించాలి చెత్తను ఆటోలో వేయకుండా రోడ్లపై వేసేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు .దాబా హోటల్స్, చికెన్ సెంటర్లు వేస్టేజిని రోడ్లపై పారేయకుండా చర్యలు తీసుకోవాలి అని అధికారులను ఆదేశించారు . అలా చెత్త వేసావారిని గుర్తించి ఐదు నుంచి పదివేల వరకు జరిమానా విధించాలని అన్నారు . పట్టణంలో కుక్కలు రెండోసారి బాలు నీపై దాడి జరగడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. కుక్కల పాపులేషన్ తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలు ఎక్కువగా తిరిగే వార్డుల్లో వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. పట్టణంలో కుక్కల దాడులు అరికట్టాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు . మున్సిపాలిటీ వార్డులలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని , బ్లీచింగ్ ఆయిల్ బాల్స్ ఫాగింగ్ ఏర్పాట్లతో దోమల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఈ సమీక్షలో జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి రవీంధర్ ప్రసాద్ , మునిసిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ , శానిటరీ ఇన్స్పైక్టర్ లు , ఎన్ జి ఓ లు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking