మున్సిపల్ పార్కులను ప్రజలు వినియోగించుకొవాలి

నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు, బస్తీ దవాఖానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
బుధవారం జిల్లాలోని కుత్భుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ పరిధిలోని ప్రగతినగర్లో ఉన్న పార్కుల ను కలెక్టర్ గౌతమ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న మొక్కలతోపాటు వాకింగ్ ట్రాక్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అదే ప్రాంతంలో ఉన్న క్రీడామైదానంను యువత క్రీడల కోసం వినియోగించుకోవాల్సిందిగా తెలిపారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రజలకు మంచి ఆరోగ్యం కల్పించడంతోపాటు వారికి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా అర్బన్ పార్కులను ఏర్పాటు చేసిందని ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడానికి ఎంతో అనువుగా వాకింగ్ ట్రాక్ ఉందని దీనిని వినియోగించుకున్నట్లయితే మరిన్ని వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే యువత, మహిళలు, చిన్నారులు చదువుతో పాటు ఆడుకునేందుకు ఇళ్ళల్లో స్థలాలు ఉండకపోవడంతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిందని క్రీడాప్రంగణాలను వినియోగించుకోవాలన్నారు. అలాగే పార్కులో, క్రీడా ప్రాంగణంలో ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే సమకూరుస్తామని కలెక్టర్ గౌతమ్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking