మనికొండ మున్సిపాలిటీలో ముసలం

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 20 జనవరి 2024: మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడా లేని విధంగా చైర్మన్ పదవి కాంగ్రెస్ కు చెందిన కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ పదవి బీ.జె.పీ కి చెందిన కె. నరేందర్ రెడ్డి లు సంకీర్ణ పరిపాలన సాగిస్తున్న విషయం జగమెరిగిన సత్యం, కాని గుట్టుచప్పుడు కాకుండా పార్టీల కతీతంగా 12 మంది బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ప్రజా ప్రతినిధులు ఏకమై సంతకాలతో కూడిన లేఖను అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్ ను కలిసి కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అందజేసినట్లు సమాచారం. మణికొండ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారిన అవిశ్వాస తీర్మానం గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. చైర్మన్ కోసం ఎవరిని బలపరుస్తారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది మరియూ చాలా మంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారని విశ్వనీయ సమాచారం, సంపూర్ణ మెజారిటీతో అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని కౌన్సిలర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబోయే చైర్మన్, వైస్ చైర్మన్ కోసం కసరత్తు జరుగుతోందని రెండు మూడు రోజుల్లో పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్వనీయ సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking