లక్షెట్టిపేట పట్టణానికి చెందిన కుశనపెళ్లి దీప్తి కి నంది అవార్డు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణానికి చెందిన కుశనపెళ్లి రాజయ్య మల్లమ్మల పెద్దకుతురు దీప్తికి విద్యసేవ రంగంలో నంది అవార్డు దక్కింది.ఈ సందర్భంగా ఈ నెల 1 వ తేదిన హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో సినీ కథ రచయిత సినీ దర్శకుల జె కే భారవి సినీ రచయిత మల్లిక్ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ సెన్సార్ బోర్డు మెంబర్ దరువు ఎల్లన్న పిసిసి అధికార ప్రతినిధి మరికంటి భావానిరెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఇప్పుడున్న పోటీ తత్వంలో సక్సెస్ వీసాస్ ఎడ్జుకేషన్ కన్సల్టెంట్స్ ఏర్పాటుచేసి ఎంతో మందిని విద్య మీద వివిధ దేశాలకు పంపించి స్థిరపర్చినందుకు తమ సేవలను గుర్తించి నాకు ఈ అవార్డు అందించి నన్ను సన్మానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంతటితో కాకుండా మునుముందు ఇంక మంచి సేవలు అందించి నాకు నా తల్లిదండ్రులకు మండలముకు జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిస్థానాని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking