ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 4;
తార్నాక నారాయణ ఈ టెక్నో పాఠశాలలో గ్రాడ్యుయేషన్ డే ను ఘనంగా నిర్వహించారు.
ప్రీ-ప్రైమరీ విద్యార్థులు కేజీ క్లాసులు పూర్తి చేసుకొని
ప్రాథమిక తరగతులలో అడుగుపెడుతున్న సందర్భంగా వారికి సర్టిఫికెట్స్ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించారు. మరియు ఈ చాంప్స్ విద్యార్థులు వారి యొక్క ప్రాథమిక తరగతులు పూర్తి చేసుకొని ఉన్నత పాఠశాలలో అడుగు పెడుతున్న సందర్భంగా వారికి కూడా
సర్టిఫికెట్స్ ఇచ్చి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, పాఠశాల జీ ఏం గోపాల్ రెడ్డి, ఏ.జి.యం. బాలపరమేశ్వర్ లు హాజరై విద్యార్థులకు సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో ఉన్నత చదువులను చదువుకొన్ని
మంచి గొప్ప స్థాయిలలో ఎదిగి అందరికీ ఆదర్శప్రాయంగా
నిలవాలని సూచించారు. ఈ
కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ పర్వీన్, హైస్కూల్ కో- ఆర్డినేటర్ ఆజాద్, ఈ చాంప్ కో- ఆర్డినేటర్ లక్ష్మీ భవాని, ఈ -కిడ్జ్ కో-ఆర్డినేటర్ నూర్, ఈ చాంప్స్ మేరీ,ఈ- కిడ్జ్ అస్మా, ఉపాధ్యాయులు ఏ.ఓ. మహేందర్, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.