రాజ్ భవన్ హైస్కూల్ లో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనర్సింహ ,మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యే దానం నాగేందర్

ఖైరతాబాద్ ప్రజాబలం ప్రతినిధి : హైదరాబాద్ రాజ్ భవన్ స్కూల్ విద్యార్థులకు స్వయంగా డివార్మింగ్ మాత్రలు వేసిన మంత్రులు దామోదర రాజనర్సింహ , పొన్నం ప్రభాకర్ గార్లు..

కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్,ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బర్రా వెంకటేశం ,హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్.చోంగ్తు,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదిప్ దురశెట్టి, తదితరులు.

National Deworming Day at Raj Bhavan High School

పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో డీ వార్మింగ్ డే జరుపుకుంటున్నాం తెలంగాణ లో చెప్పాలంటే నట్టల మందు కార్యక్రమం. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.. ఈరోజు నుండి ఈ నెల 27 వరకు హైదరాబాద్ లో ఉన్న 11 లక్షల 77 వేల మంది పిల్లలకు ఈ నులిపురుగుల నివారణ కార్యక్రమం ద్వారా టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 19 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు ఈ మందులు వేసుకోబడును.. శారీరక ఎదుగుదల సక్రమంగా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవాలి. తల్లిదండ్రులు మీ పిల్లలకు ఈ టాబ్లెట్స్ వేపించాలని విజ్ఞప్తి చేస్తున్నా.. భవిష్యత్ లో ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపడుతుంది.. దామోదర రాజనర్సింహ గారి నేతృత్వంలో ఆరోగ్య శాఖ నీ మరింత ముందుకు తీసుకుపోవడానికి సమీక్షా జరుపుకోవడం జరిగింది.. వారికి ధన్యవాదాలు..ఈరోజు నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమం జరుపుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking