యువతకు ప్రేరణ నేతాజీ

 

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్వాతంత్ర్యం కోసం పోరాడాలి అనే లక్ష్యంతో తన ప్రతి మాటా ఓ తూటాలా ఉండడమే కాకుండా ప్రతి వ్యక్తిలొనూ స్వాతంత్యం కోసం పోరాడాలనే కాంక్ష రగిలించే విధంగా మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు నేను స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని యువతకు ప్రేరణ కల్పించిన గొప్ప జాతీయ నాయకుడని సామాజిక కార్యకర్త వేముల సైదులు అన్నారు..
ఈ రోజు పరాక్రమ్ దివస్ మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 127 వ జయంతి కార్యక్రమాన్ని కక్కిరేణి గ్రామంలో ఎర్రగడ్డ సెంటర్లో ఘనంగా పూలమాలలు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి గొప్ప ధైర్యాన్ని ప్రదర్శించి
మన దేశ అభ్యున్నతి కోసం రోజ పని చేద్దాం అంటూ , పరాక్రమ్ దివస్ సందర్భంగా దేశానికి ప్రాణాలర్పించిన దేశ సైనికులకు జోహార్లు అర్పిస్తూ యువతకు ప్రేరణ కలిగించే నేతాజీ సుబాస్ చంద్రబోస్‌ గారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో కన్నెబోయిన వెంకటేష్ , శివకుమార్ , సత్యనారాయణ , నరేష్, నవీన్, సుధాకర్, అనిల్, విష్ణు, భరత్ చంద్ర, నరసింహ , బిక్షం , లింగయ్య సైదులు , శంకర్ ఆదినారాయణ , కృష్ణ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking