హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులుషబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), వ్రేణుగోపాల్ రావు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), ఢల్లీిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి లను, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలుమహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లను ముఖ్యమంత్రి అభినందించారు.
దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.