ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 9:
సింగరేణి నూతన సంవత్సర (2025) క్యాలెండర్ ను గురువారం జీ.యం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మందమర్రి ఏరియా జి.యం జి. దేవేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్యాలెండర్లను మందమర్రి ఏరియలోని వివిధ గనులు, విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు అందజేయనున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థలోని వివిధ గనులలో వినియోగిస్తున్న సాంకేతికత, అత్యాధునిక యంత్రాలు,సంస్థ ద్వారా చేపట్టిన వివిధ కార్యక్రమాలు,ఉద్యోగుల సంక్షేమం మొదలగు చిత్రాలతో ఈ క్యాలెండర్ రూపొందించడం జరిగిందన్నారు. ఈసందర్భంగా ఉద్యోగులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం విజయ ప్రసాద్ ఏఐటీయూసీ,మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ, దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, యూనియన్ నాయకులు, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, డి.వై పి.ఎం ఎం.డి ఆసిఫ్ పాల్గొన్నారు.