ఆకట్టుకునేలా ముగ్గులు.. ఆలయాల్లో పూజలు..
కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన జనం
మెదక్ జనవరి 1 ప్రాజబలం న్యూస్ :-
న్యూఇయర్ సందడి మెదక్ జిల్లా అంతటా నెలకొంది. కోటి ఆశలతో జనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సోమవారం ఉదయం నుంచే జనం దేవాలయాల బాట పట్టారు. జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలైన శ్రీ కోదండ రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, సాయిబాబ దేవాలయం, శివా యాలు భక్తులతో రద్దీగా మారాయి. జనం బారులు తీరడంతో గంటల తరబడి దర్శనం కోసం క్యూలో నిలబడాల్సి వచ్చింది. కొత్త సంవత్సరంలో చె డుకు స్వస్తి పలికి మంచి పనులు చేపట్టాలని పలువురు తమ ఇష్ట దైవాలను ప్రార్థించారు. నూతన సంవత్సర సందర్భంగా అందరి ఇళ్ళ ముందుర ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు.