ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శుక్రవారం ఉదయం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలంతా నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యోగాను అనుసరిస్తున్నారని, యోగా వలన మానసిక ప్రశాంతత తోపాటు ఎన్నో వ్యాధులు నయం చేసుకోవచ్చునని తెలిపారు.ప్రతీ ఒక్కరు రోజూ ఉదయం యోగా చేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా యోగ దినోత్సవ కార్యక్రమ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, డీడబ్ల్యూవో నాగమని, డీఎంహెచ్ వో ధనరాజ్, మున్సిపల్ కమీషనర్ రాజు,అధికారులు, విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు