సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు.మామడ మండలం కొరిటికల్ మాజీ సర్పంచ్ ప్రస్తుత మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగారెడ్డి ఆధ్వర్యం లో ఆదర్శనగర్ గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, కొరటికల్ గ్రామ ఎంపిటిసి సౌజన్య రాజేశ్వర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ లవివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు,మాజీ సర్పంచులు బుధవారం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనబడకుండా పోతుందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పిన ఆ పార్టీ నాయకుల్లో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking