చదివిన బడికి చేయూతనిచ్చిన ఎన్ఆర్ఐలు

 

జగిత్యాల, డిసెంబర్ 27: ఎవరెట్లా పోతే మాకెంది అనుకునే కాలమిది. కానీ తమకు చదువునిచ్చిన బడిని మరువలేదు ఆ ఎన్నారైలు. ఉన్నత విద్యలను అభ్యసించి విదేశాల్లో స్థిరపడినా తమ చదువుకు మూలలను నింపిన తమ గ్రామమైన మొరపెళ్లిలోని రెండు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించిన ఎన్నారైల సేవాభావమిది. జగిత్యాల రూరల్ మండలంలోని మొరపెళ్లి గ్రామానికి చెందిన బేతి గోపాల్ రెడ్డి, గంగభావానిలు వారి కుటుంబ సభ్యులు గతంలోనూ మొరపెళ్లి జడ్పి హైస్కూల్ లో రెండు లక్షల రూపాయలతో టాయ్ లెట్లను నిర్మించారు. అలాగే మరో ఎన్నారై ఎడమల కృష్ణా రెడ్డి 20 వేల రూపాయల తో వాటర్ ఫూరిఫైర్డ్ అందించారు. మరోసారి బుధవారం అదే గ్రామంలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు 30 వేల రూపాయల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులు, టై, బెల్టులు, ఐడి కార్డులు అందించారు. అలాగే జడ్పి హైస్కూల్ విద్యార్థుల సౌకర్యార్టం 50 వేల విలువ గల వెబ్ కేమారాతోపాటు సీసీ కెమెరాలను అందించారు. వీరి సేవాభావాన్ని ఆ గ్రామస్తులు అభినందించగా ఇందులో శ్రీమతి బోల్లే సత్తమ్మ గంగారాం సర్పంచ్, జగిత్యాల సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి, ఎంపిటిసి భూమారెడ్డి , ఉపసర్పంచ్ రామ్మోహన్, గంగాధర్, దేవయ్య ఎస్సెమ్మెస్ చైర్మన్లు, కొక్కుల గణేష్, బన్న పిజి హెచ్ ఎం, పి శ్రీనివాస మూర్తి హెచ్ ఎం, బి కిరణ్, రఘునందన్, శ్రీమతి పి సుగుణ, ఏవీఎన్ రాజు, రాజశేఖర్, అంజి బాబు, శ్రీమతి పద్మ , గీతాదేవి, షాహిన్ మేడమ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking