తూప్రాన్ మున్సిపాలిటీలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన అధికారులు ప్రజాప్రతినిధులు.

 

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన కార్యక్రమం ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరకాస్తుల స్వీకరణ మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని వార్డులో మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయిజుద్దీన్ గారి అధ్యక్షతన గౌరవ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ గారు ముఖ్య అతిధిగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.మరియు గౌరవ మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ గారి ఆదేశానుసారం 16వార్డు లలో దరకాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆయా వార్డు అధికారుల సమక్షంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో వైస్ చైర్మన్ శ్రీనివాస్ జెడ్పి సీఈవో కైలాస్ , డిప్యూటీ తహసీల్దార్ ప్రేందాస్ మెడికల్ సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, శ్రీశైలం గౌడ్, మామిడి వెంకటేష్, తలారి మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లెర్ల రవీందర్ గుప్తా, వార్డు ప్రజలు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking