పాపన్న గౌడ్‌ నేటి యువతకు ఆదర్శం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల ప్రజాబలం ప్రతినిధి: నిజాం సైన్యాన్ని ఎదిరించిన ధీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని ఆయన వీరత్వం నేటి యువతకు ఆదర్శమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆన్నారు..జగిత్యాల జిల్లా లోని ఎండపల్లి మండల కేంద్రంలో సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకల ల్లో ముఖ్య అతిధిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హజరైపాపన్న గౌడ్‌ చిత్ర పటానికి మాల వేసి,ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్బండ వర్ణాల సంక్షేమానికి పోరాడిన సర్వాయి పాపన్న జయంతి ని అధికారికంగా నిర్వహిం చాలని గత 30 సంవత్స రాలుగా బహుజనులు పోరాడు తున్నారు. కానీ, సమైక్య పాలనలో పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని విమర్శించారు.కానీ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన పాపన్న జయం తి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారన్నారు. అందులో భాగంగా 18 న సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.ఈకార్యక్రమంలో వివిధగౌడ సంఘ సభ్యులు, ప్రజా ప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.. పాపన్న గౌడ్‌ సేవలను త్యాగాలను స్మరించుకో వాలి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ ఆ దిశగా వివిధ కుల సంఘం నాయకులు నడ వాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ తెలి పారు.శుక్రవారం రోజున జిల్లా కలెక్టర్‌ సమావేశ హాలులో సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ 373 వ జయంతి ని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు.ఈ సందర్భంగాసర్దార్‌ పాపన్న గౌడ్‌ చిత్రపటానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ దావా వసంత, జిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ రెవెన్యూ బిఎస్‌ లత ,గ్రంథాలయ చైర్మన్‌ జి.చంద్రశేఖర్‌ గౌడ్‌, సంబంధిత కుల సంఘ నాయకులు జ్యోతి ప్రజ్వలన గావించి ఆనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతిని ప్రభుత్వపరంగా ఇంత ఘనంగా నిర్వ హించుకోవడం శుభపరిణామం అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం గర్వించదగ్గ వీరులు ,ఎవరైతే సమాజానికి సేవ చేసారో వాళ్లని గుర్తించిన ఏకైక వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ గారే అని కొనియా డారు. సర్వాయి పాపన్న గౌడ్‌ విరోచితంగా పోరాడి విప్లవాలు చేశారని, ఆత్మగౌరవం కోసం వారి ప్రాణాలను సైతం అర్పిం చిన వ్యక్తి అయితే, అలాంటి ఉద్యమ నాయకుడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ అధికార గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అనడంలో సందేహం లేదని అన్నారు. .గతంలో ఏనాడు కూడా ఈ స్థాయిలో ఆదివాసి బిడ్డ కొమరం భీమ్‌ గాని బంజారా నాయకుడు సేవాలాల్‌ గాని ,కొండ లక్ష్మణ్‌ బాపూజీ, కాలోజి నారాయణ రావు, ప్రొఫెసర్‌ జయశంకర్‌, వీరందరినీ స్మరించుకుంటూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిం చడం ఇందులో అధికారులు కుల సంఘ నాయకులు భాగస్వామ్యం కావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు.అన్ని వర్గాల వారిని కలిసి ఉండాలని ఆలోచనతో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగు తుందన్నారు.సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కిలా షాపూర్‌ లో ఏ కోటన యితే పాలించారో ఆ కోటకి మన ముఖ్యమంత్రి 01 కోటి రూపాయలు కేటాయించి మరమ్మత్తులు చేపట్టడం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ చరిత్ర ఆనవాళ్లను గుర్తుంచుకునే విధంగా సమాజానికి తెలియ జెప్పడం హర్షించదగ్గ విషయ మని అన్నారు.ఆనంతరంజిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ దావ వసంత `సురేష్‌ మాట్లాడుతూమూడు శతాబ్దాల క్రితం బహుజన రాజ్యాధికారం కావాలని పోరాడిన గొప్ప యోధుడు సర్దార్‌ పాపన్న గౌడ్‌ అని, మొగలాయిల దౌర్జన్యాన్ని వెట్టి చాకిరి రాచరిక పాలన వ్యవస్థనుండి బహుజన బిడ్డలకు ఆర్థిక సమానత్వం కల్పించాలని కత్తి పట్టిన యోధుడు ధీరత్వం ఉన్న వ్యక్తి సర్దార్‌ పాపన్న అని తెలిపారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్ని కులాలను గౌరవిం చుకుంటూ వారి ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు .ఆనంతరంజిల్లా కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ భాషా మాట్లాడుతూ బహుజనులు ఏకమైతే సాధించ లేనిది ఏవిూ లేదని అనే నినాదం తో సర్దార్‌ పాపన్న గౌడ్‌ నేటి తరా నికి స్ఫూర్తి దాయకమని అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking