పుష్పాలంకరణ, పంచ కట్టు వేడుకలో పాల్గొన్న మేకల మల్లి బాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం రాయి గూడెం గ్రామానికి చెందిన కోట రాజు కల్పన గార్ల చి. ఐశ్వర్య చి వికాస్ ల ఓణీల వేడుక మరియు పంచ కట్టు వేడుక ల కార్యక్రమంలో పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చిరంజీవిలను అక్షింతలు వేసి, చిరంజీవులను ఆశీర్వదించారు. కార్యక్రమం తదనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో ఆర్ గ్యారంటీ పథకాల గురించి ప్రస్తావించగా, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం లాగా బంధు ప్రీతికి, అవినీతికి పైరవీలకి ఆస్కారం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని,అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తించేటట్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పుల వెంకన్న పరీమిశెట్టి సాంబయ్య సిహెచ్ వీరబాబు, ఉబ్బని రాములు, ప్రసాదు, భద్రయ్య,చేకుట్ల సతీష్, కోట రాజు, ఓరుగంటి యుగంధర్,, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking