ఆటో కార్మికులను ఆదుకోవాలని కలెక్టర్ కు వినతి పత్రం

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 27 (ప్రజాబలం) ఖమ్మం ఉచిత బస్ సర్వీస్ వల్ల ఆటో కార్మికుల కుటుంబాలు రోడ్డుపాలైనాయని ప్రతి ఆటో కార్మికుడు రోజువారిగా 800 నుండి 1000 రూపాయల వరకు తోలే ఆటో కార్మికుడు ఉచిత బస్ సర్వీస్ వల్ల 200 నుండి 300 కూడా తోలలేని పరిస్థితి ఆటో కార్మికులకు ఏర్పడిందని కావున తక్షణమే ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో కార్మికుల సమస్యలపై ప్రతి జిల్లాలోని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు . అందులో భాగంగా బీఆర్టీయూ టాటూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఆటో కార్మికులు ర్యాలీగా వెళ్లి ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి ప్రతినెల 15వేల రూపాయలు అందించాలని మరియు ఫైనాన్స్ లలో తీసుకున్న ఆటోల లోనును ప్రభుత్వమే భరించి ఆటో కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని ఏవో అరుణ కు వినతి పత్రం అందించడం జరిగింది . తప్పకుండా ప్రభుత్వం దృష్టికి ఆటో డ్రైవర్ల సమస్యలను తీసుకుని పోయి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చూస్తామని వారు మాట ఇవ్వడం జరిగింది . ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి & టాటూ జిల్లా అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ , బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎండి వై పాషా , టాటూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వ రరావు నగర అధ్యక్షుడు వేమా సిల్వా రాజ్ , నాయకులు షేక్ జాని మియా , మైసా ఆంజనేయులు లక్ష్మీనారాయణ , గుంటి శ్రీను , రాంబాబు , కుక్కల రామకృష్ణ , ముల్లార్ , అబ్దుల్ , సలీం , సాయిబాబా , పాషా , మస్తాన్ , గోపయ్య , రమేష్ మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking