ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ తహసిల్దార్ కు వినతి పత్రం.

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 11

జమ్మికుంట పట్టణంలోని సర్వే నెంబర్ 629లో ఉన్న ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ భూములను కాపాడాలని ఎమ్మార్పీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రేణికుంట్ల సాగర్ డిమాండ్ చేశారు. గత మూడు రోజులుగా వివిధ దినపత్రికల్లో వస్తున్న భూ కబ్జాపై స్పందించిన సాగర్ గురువారం జమ్మికుంట తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిలువ నీడలేని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారని 60 గజాల స్థలం కావాలని అధికారుల చుట్టూ తిరుగుతూ దరఖాస్తు పెట్టుకున్న వారిని కనీసం కనికరించకుండా ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే సహించేది లేదని దీనిపై రెండు రోజుల్లో కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సైతం కలిసి ఎమ్మార్పీఎస్ పక్షాన ఫిర్యాదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ అక్రమ భూకబ్జాపై వెంటనే స్థానిక ఎమ్మెల్యే జిల్లా మంత్రి స్పందించాలని ఇందులో ఎవరి పాత్ర ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడే వరకు మా ఉద్యమం కొనసాగుతుందని సాగర్ అన్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకొని అంతా నాదే అంటున్న పట్టించుకోని స్థానిక నేతలు అధికారులను చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుందని ఆయన అన్నారు. రెండు రోజుల్లో అధికారులు భూమిని స్వాధీనం చేసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సాగర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
ఎం ఆర్ పి ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు రేణికుంట్ల సాగర్, నాయకులు వాసాల మల్లేష్ పర్లపల్లి తిరుపతి కండెం మహేందర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking