ప్రజాబలం క్యాలెండర్ విడుదల!

 Prajabalam calendar released

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జనవరి9:- ప్రజాబలం దినపత్రిక అత్యంత ప్రతిష్టాత్మకంగా ముద్రించిన నూతన ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ ను ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు దాసరి కృష్టారెడ్డి,నూతనంగా ఎన్నికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు సోమవారం లాంఛనంగా అవిష్కరించారు.ఈ సందర్బంగా దాసరి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రజాబలం దినపత్రిక ముద్రించిన క్యాలెండర్ అందరి ఇండ్లలో ఉండవల్సిన విధంగా ఆకర్షణీయంగా ముద్రించారని అన్నారు.ఈ క్యాలెండర్ మద్రించడానికి సహకరించిన ప్రకటన కర్తలకు దాసరి కృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు.అనంతరం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రతి మనిషి దిన చర్యలో క్యాలెండర్ లోని థితులు ప్రభావం చూపుతాయని,అ లాంటి క్యాలెండర్ ను ప్రతి ఒక్కరు ఇంట్లో పెట్టుకోవడానికి స్వాగతిస్తారని,అందుకే అనేక సంస్థలు క్యాలెండర్ ముద్రించడానికి ఉత్సుకత కనబర్చుతాయని అన్నారు.అనంతరం ఇటీవల గెలుపొందిన గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు,ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య,కోశాధికారి బొళ్లే అమర్ నాథులను ప్రజాబలం బ్యూరో ఛీప్ కానుగుల రవి శాలువతో సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వరంగల్ ప్రెస్ క్లబ్ ఫార్మర్ అధ్యక్షులు గడ్డం కేశవమూర్తి,పిన్న శివకుమార్,ఐజేయూ జాతీయ కౌన్సిల్ సీనియర్ ఫార్మర్ మెంబర్,తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు రాష్ట్ర కోషాధికారి వేముల సదానందం నేత,టీయూడబ్ల్యూజే (ఐజేయూ) హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తోట సుధాకర్,నాయకులు బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking