ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 19 :
మందమర్రి పట్టణానికి చెందిన గడ్డం మౌనిక రెడ్డీ పుట్టిన రోజును పురస్కరించుకొని వారి తల్లిదండ్రులు పేదలకు దుప్పట్లు పంచాలని నిర్ణయించుకుని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ సంప్రదించగా మంగళవారం పేద ప్రజలకు దుప్పట్ల పంపిణీ మరియు ఒంటరి మహిళకు నిత్యాసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు నంది పాట రాజ్ కుమార్, ఎం.డి జావీద్ పాషా, దాడి రాజు, దిలీప్ , చందు, సాయితేజ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.