ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 11 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో, ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.గురువారం
ప్రిన్సిపల్ ఎం.లలిత కుమారి పర్యవేక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు పిల్లలందరూ వివిధ రంగులతో హృద్యమైన రంగవల్లులను కళాశాల ప్రాంగణమంతా తీర్చిదిద్దారు ఏడవ తరగతి విద్యార్థిని మధుప్రియ కనువిందైన రూపంతో,హరిదాసు వేషధారణలో హరినామ సంకీర్తన చేస్తూ తోటి విద్యార్థినులకు, ఉపాధ్యాయునులకు, కళాశాలకు విచ్చేసిన తల్లిదండ్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రత్యేకంగా నియమించబడిన న్యాయ నిర్ణేతల బృందం విద్యార్థినులు వేసిన రంగవల్లులను పరిశీలించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రంగవల్లులకు బహుమతులు సూచించగా, ప్రిన్సిపల్ వాటిని ప్రకటించారు.అంతకు ముందు,ప్రతి తరగతి టీచర్, తమ పిల్లలు వేసిన ముగ్గులను ప్రిన్సిపల్ ఉపాధ్యాయినీ బృందము తల్లిదండ్రులందరికీ ప్రదర్శిస్తూ,ఉత్సాహపరిచారు.అనంతరం రంగవల్లుల పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు,పాఠశాల మేనేజ్మెంట్ నుండి ఉత్తమ బహుమతులు అందజేయబడ్డాయి.