సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి మరింత సేవలు అందించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు.
మంగళవారం రోజున జవహర్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఆయుష్ విభాగం, ఎమర్జెన్సీ అండ్ డ్రెస్సింగ్, ఇమ్యూ నైజేషన్ ,ఫార్మసీ, ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషెంట్ రూమ్ లను కలియతిరిగారు. ఇన్ పేషెంట్ రూమ్ ను పరిశీలించి రిజిస్టర్లను తనిఖీ చేశారు, వైద్య అధికారులు కలెక్టర్ కు వివరించారు. వైద్యాధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత వైద్య సేవలు అందించాలన్నారు. ఎంతమంది షుగర్, బిపి ఇతర వ్యాధులతో ఆరోగ్య కేంద్రానికి వస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎంతమందికి షుగర్ బిపి టాబ్లెట్స్ ఇస్తున్నారని, స్టాక్ ఎంత మేరకు అందుబాటులో ఉందని ఆరా తీశారు. అయిపోయిన వెంటనే మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా బీపీ షుగర్ టాబ్లెట్లు ఇవ్వడం జరుగుతుందని ప్రజలకు తెలియపరిచేలా అవగాహన కల్పించాలన్నారు. ల్యాబ్ లో ఉన్న పరికరాలను వాటి పనితీరును వైద్య సిబ్బంది వివరించారు. ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్ర ఆపరేషన్లు జరుగుతున్నాయా లేదా అని కలెక్టర్ ఆరా తీయడం జరిగింది. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. పీహెచ్ సీలోనార్మల్ డెలివరీ పెంచాలని అన్నారు. బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ లే కాకుండా మరికొన్ని టెస్ట్ లను చేయడానికి ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని డిఎం అండ్ హెచ్వో ను కోరారు . మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఏహెచ్ మల్కాజ్గిరిలో అత్యవసర డెలివరీలు నిర్వహించాలని కలెక్టర్ వైద్యాధికారులను కోరారు.
అనంతరం జవహర్ నగర్ లో ఉన్న ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణం పనులను అడిగి తెలుసుకున్నారు.10వ తరగతి చదువుకునే విద్యార్థిని విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. టెస్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇవ్వడం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఏఏ ఆటలంటే ఇష్టమని అడిగారు, విద్యార్థులు క్రికెట్ కబడ్డీ వాలీబాల్ అంటే ఇష్టమని కలెక్టర్కు తెలియజేశారు. విద్యార్థినీ విద్యార్థులకు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని పిల్లలకు హితబోధ చేశారు. డిజిటల్ బోర్డు ద్వారా విద్యా బోధన జరుగుతుందని ఉపాధ్యాయులు కలెక్టర్ కు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధనలు అందించాలని ఉపాధ్యాయులను కోరారు. పాఠశాలల్లో డైనింగ్ హాల్ , త్రాగునీరు, వాష్ ఏరియా, లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అనంతరం కలెక్టర్ జవహర్ నగర్ లోనీ ప్రభుత్వ భూములను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, జిల్లా వైద్యాధికారి రఘునాథ స్వామి, జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి, డి డబ్ల్యుఓ కృష్ణారెడ్డి, ఎమ్మార్వో సుచరిత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking