విద్యార్థులకు యూనిఫారాలు సిద్ధం

 

మహిళా సంఘ సభ్యులు మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
జిల్లా కలెక్టర్ గౌతమ్

ప్రజాబలం ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జూన్ 5:
తెలంగాణ ప్రభుత్వము ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు వారు పాఠశాల విద్యను కొనసాగించడానికి ప్రోత్సహించే దిశగా రాష్ట్రస్థాయిలో అన్ని జిల్లాలలో గల స్వయం సహాయక సంఘ సభ్యుల ద్వారా యూనిఫారాలు పుట్టించి పంపిణీ చేయుటకు తగిన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది .ఇందులో భాగంగా శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి గారి ఆదేశానుసారము డిఆర్డిఏ మరియు మెప్మా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో గల ఆధీనంలో గల 507 ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 89,565 మంది విద్యార్థిని విద్యార్థులకు జిల్లాల్లో గల స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫారాలు పంపిణీ చేయడంలో భాగంగా జూన్ 12 తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభించే రోజు వరకు ఒక జత యూనిఫారాలు అందజేయడం కోసం తగిన చర్యలు తీసుకోవడం జరిగింది . జిల్లాలో గల ఐదు గ్రామీణ మండలాలలో 8 మునిసిపాలిటీలలో మరియు జిహెచ్ఎంసి పరిధిలోగల పాఠశాలల్లో మొత్తం 507 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు యూనిఫారాలు కుట్టించి సకాలంలో అందజేయడం కోసం సిద్ధం చేయడం జరిగింది. గ్రామీణ మండలాలలో 125 పాఠశాలలకు గాను 11278 మంది విద్యార్థులకు, మునిసిపాలిటీలలో 117 పాఠశాలలకు గాను 9921 మంది విద్యార్థులకు, బిహెచ్ఎంసి పరిధిలో 265 పాఠశాలల కు గాను 28330 మంది విద్యార్థులకు దుస్తులను కుట్టించడం జరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు యూనిఫారంలు కుట్టుటకు గాను సంబంధిత పాఠశాలకు అందజేయుటకు గాను ప్రభుత్వపు గతంలో 50 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది .ప్రస్తుతం జిల్లాలోని స్వయం సహాయక సంఘ సభ్యులు టైలరింగ్ నేర్చుకుని ఉండటం, మరియు శిక్షణ పొంది ఉండటంతో ఉత్సాహంగా మరియు అనుకున్న ప్రకారం లక్ష్యాన్ని సాధించడం కోసం నడుం బిగించారు. మహిళా సంఘ సభ్యులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వము గతంలో నిర్ణయించిన 50 రూపాయలకు అదనంగా మరో 25 రూపాయలు జోడించి 75 రూపాయలుగా చేయడం జరిగింది. ఇట్టి పెంపుదల వలన మహిళా సంఘ సభ్యులు మరింత ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో భాగస్వాములై విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. మండలంలో జిల్లాలో గల ఐదుగురు డిపిఎంలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ప్రతి కేంద్రాన్ని ఏపీఎంలు మహిళా శక్తి కుట్టు కేంద్రాలను సందర్శిస్తూ ప్రోత్సహించడం జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సర్వదా హర్షణ వ్యక్తం చేస్తున్నారు. గతంలో పాఠశాల విద్యార్థుల దుస్తులు కుట్టడానికి ఏజెన్సీల ద్వారా లేదా స్థానికంగా ఉన్న మహిళలకు అప్పగించేవారు. పాఠశాల ప్రారంభించిన రెండు మూడు నెలల వరకు పంపిణీ అవుతూ ఉండేవి. కానీ ప్రస్తుతం జిల్లాలోని మహిళలను ప్రోత్సహిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక అంకురార్పణ జరిగిందని చెప్పాలి. రోజువారి కూలి పనుల కన్నా స్థానికంగా గ్రామాలలోనే పని దొరకడం రోజుకు 400 నుండి 600 రూపాయల వరకు సంపాదించడానికి మంచి ఆదాయ వనరుగా ఈ కుటుంబ యంత్రాలు ఈ కుట్టు కేంద్రాలు సహకరిస్తున్నాయని చెప్పవచ్చు. మహిళలు వారి పిల్లలు కోసం ఎంత జాగ్రత్తగా దుస్తులు కుట్టుతారో ,అదే శ్రద్ధతో ప్రతి విద్యార్థికి దుస్తులు కుట్టాలని జిల్లా యంత్రాంగం సూచించడం జరిగింది మహిళలకు కొంత శ్రమ తగ్గించాలని ఆలోచనతో డిఆర్డిఏ ఆధ్వర్యంలో సుమారు 150 కుట్టుమిషన్ లను జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా మోటర్లు ఏర్పాటు చేయించడం జరిగింది. దీనితో మహిళలకు కొంత శ్రమ తగ్గి ఎక్కువ దుస్తులు కుట్టడానికి సౌకర్యం కలిగింది.. ఇప్పటికే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో గల పాఠశాలకు ఏపిఎంల ద్వారా మండల విద్యాధికారులకు దుస్తులు అందించడం జరిగింది. పాఠశాల ప్రారంభం కంటే ముందే దుస్తులు సిద్ధం చేయడం సర్వదా హర్షణ వ్యక్తపరుస్తున్నారు. కుట్టు కేంద్రాల ద్వారా ఉపాధి కల్పన కుట్టు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక మహిళలు కు ఉపాధి లబ్ధి కలుగుతుంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల దుస్తులతో పాటు ఇతర పాఠశాలలు మరియు గార్మెంట్ యూనిట్ వారు కూడా ముందుకు వస్తూ మహిళలను ప్రోత్సహిస్తామని హామీ ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు అదనపు కలెక్టర్ గారు కూడా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శిస్తూ వారికి తగిన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. జిల్లా విద్యాధికారిని శ్రీమతి విజయ కుమారి గారు కూడా డిఆర్డిఏ ద్వారా మహిళలను ప్రోత్సహించడం చాలా సంతోషమని స్థానికంగా మహిళలకు పాఠశాల దుస్తులు అందించడం జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియపరిచారు. కీసర నుండి ఎంఈఓ గారు దుస్తులు తీసుకున్న సమయంలో ఇంత తొందరగా దుస్తులు ఇవ్వడం ఒకంత ఆశ్చర్యానికి గురి అయినట్లు తెలపడం జరిగింది. మహిళా సాధికార దిశగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు అవసరం మేరకు బ్యాంకులు శ్రీనిధి ద్వారా రుణాలు అందించి పర్మినెంట్ కేంద్రాలు నిర్వహించే దిశగా తగు చర్యలు తీసుకుంటున్నట్లుగా డిఆర్డిఓ తెలియపరిచారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking