భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా కేంద్రంలో.ఆర్ డి ఓ. కార్యాలయం ముందర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ లో తృణముల కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అక్కడ భారత దేశ ఉపరాష్ట్రపతిని వ్యంగ్యంగా అనుకరిస్తూ మాట్లాడుతూ చేపట్టిన కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ వీడియో చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్న ఉపరాష్ట్రపతిని వ్యంగ్యంగా అవమానించడం జరిగింది దేశ ప్రజలకే అవమానమని భావిస్తూ ఈరోజు రాహుల్ గాంధీ కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్న గారి భూమయ్య,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అయ్యన్న గారి రాజేందర్,జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి ,జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్, జిల్లా కార్యదర్శి కొరిపెల్లి శ్రావణ్రెడ్డి ,అసెంబ్లీ కన్వీనర్ శ్రీ గాదె విలాస్,దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఒడిసెల అర్జున్, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లం భాస్కర్, శ్రీ రామోజీ నరేష్, నాయకులు తోట సత్యనారాయణ, కొండాజి శ్రావణ్, పంతికే ప్రకాష్, జమాల్, ఆకుల కార్తీక్, మూడరపు దిలీప్, రంజిత్, వెంకట్, రావుల విట్టల్, అజయ్, హనుమంతురాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking