14, 15 వార్డులో ప్రజా పాలన దరఖాస్తులు. హాజరైన ప్రజాప్రతినిధులు.

 

మెదక్ తూప్రాన్ డిసెంబర్ 28 ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ లో స్థానిక మహిళ భవనం వద్ద 14 వార్డ్ నాయకులు తలారి మల్లేష్, 15 వార్డ్ కౌన్సిలర్ శ్రీశైలం గౌడ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి చేతిలో మీదుగా అప్లికేషన్ ఫారాలను అందించారు. వార్డు ఇంచార్జ్ స్వప్న, భూపతి రెడ్డి సమక్షంలో మహాలక్ష్మి, రైతు భరోసా , గృహజ్యోతి చేయుత ఇందిరమ్మ, ఇండ్ల పథకాల, కింద దరఖాస్తుల స్వీకరణ పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయురాలు పద్మ, మహిళా గ్రూపు సంఘం నాయకురాలు జ్యోతి , మహిళా గ్రూప్ సభ్యులు మండల రెవెన్యూ మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking