తూప్రాన్ లో సంతోషిమాత పుట్టినరోజు సందర్భంగా ఘనంగా పూజలు హాజరైన ప్రజాప్రతినిధులు భక్తులు.

 

మెదక్ తూప్రాన్ ఆగష్టు 31
ప్రజా బలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో శ్రీ హనుమాన్ బాలాంజనేయ స్వామి దేవాలయంలో సంతోషి మాత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత తూప్రాన్ మున్సిపాలిటీ16 వార్డు కౌన్సిలర్ కొడిపాక నారాయణ గుప్తా దంపతులు, పండితులు సాయిరాం శర్మ సమక్షంలో వేద మంత్రోచ్ఛారణ మధ్య సంతోషిమాత విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు .భక్తితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తూప్రాన్ మున్సిపాలిటీ లో సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కౌన్సిలర్ కోడిపాక నారాయణ గుప్తా మాట్లాడుతూ పూర్వము గణపతి దేవుని కుమారులకు రాఖీ కట్టడానికి వెలసిన అమ్మవారు సంతోషిమాత అని వేద పండితులు చెప్తారని, 14 శుక్రవారాలు సంతోషమాత‌ వ్రత పూజా భక్తితో పూజలు నిర్వహించిన వారి వారి కుటుంబ సభ్యులు వారి ఇల్లు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండునని , దేశ ప్రజలందరూ సంతోషిమాత ఆశీర్వాదం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ‌, దేశ రాష్ట్ర జిల్లా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. మరియు దేశ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో పండితులు సాయిరాం శర్మ, రామకృష్ణ శర్మ, నాయకులు గడ్డం ప్రశాంత్ కుమార్, గుమ్మడి శ్రీనివాస్, సాయి యాదవ్ ప్రజా ప్రతినిధులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking