జీళ్లచెరువు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రసాద్ రెడ్డి దంపతుల పూజలు

 

-108 జంటల నడుమ వైభవంగా స్వామి వారి కళ్యాణ వేడుక

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మండలంలోని జీళ్ల చెరువు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు శనివారం హాజరయ్యారు. చెరువు స్వర్ణ ఆధ్వర్యంలో 108 జంటల నడుమ ..ప్రసాద్ రెడ్డి దంపతులు విశేష పూజలు గావించారు. అనంతరం అన్నదానం నిర్వహించగా..సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పీ పీ జూకూరి గోపాలరావు, బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రవి, ఎండీ.హాఫీజుద్దీన్, పెండ్ర అంజయ్య, సుధాకర్ రెడ్డి, లింగా రెడ్డి, చాట్ల సత్యనారాయణ, భీష్మాచారి, దేవస్థానం చైర్మన్ వీరబాబు, నారాయణాచార్యులు పాల్గొన్నారు.

సల్లంగా చూడండి సమ్మక్క సారక్కా

నేలకొండపల్లి మండలంలోని కోరట్ల గూడెంలో వనదేవతలు సమ్మక్క, సారక్కల గద్దెల వద్ద పొంగులేటి ప్రసాద్ రెడ్డి, శ్రీ లక్ష్మీ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి గుడిలో కాళీమాతకు కూడా మొక్కుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking