ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య :: పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

 

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు.

ప్రతి పేదవాడికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయం.

విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉంది.

ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ గా అంబేద్కర్ ప్రపంచ దేశాలకు స్ఫూర్తి.

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా 13 జూన్ 2024 : ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్దులకు నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని ప్రతి పేదవారికి ఉచిత విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయితీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

గురువారం బండారుపల్లి ఆదర్శ పాఠశాలలో పంచాయితీరాజ్, స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో కలిసి 2024-25 విద్య సంవత్సరంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా బోధన జరుగుతుందని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు,పాఠ్య పుస్తకాలు,ఉచిత భోజనం , ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే విద్యార్థులకు ఉచిత వసతి తో పాటు కాస్మెటిక్స్ ఇతర సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యా రంగాలకు పెద్దపీట వేసిందని విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాలలో తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారని ప్రభుత్వ పాఠశాలలలో వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు మొదటి అడుగు పడుతుందని విద్యార్దులు వారి తల్లి తండ్రుల ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని అన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే గొప్ప విజయాలు సాదిస్తున్నారని , మహనీయుల జీవిత చరిత్ర , వారు చేసిన కృషి , సాధించిన విజయాలు విద్యార్దులకు పాఠ్య అంశాలుగా బోధించాలని మంత్రి సూచించారు.

గ్రామాలలో ఉండే ప్రాథమిక పాఠశాలలలో అగన్వాడి కేంద్రలలోని చిన్నారులకు ఈ విద్య సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం నర్సరీ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలు నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని , విద్య ద్వారా వచ్చే విజ్ఞానాన్ని ఎవరు దోచుకోలేరని, విజ్ఞానం తరగని నిధి అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య అర్హతలు కలిగిన ఉపాధ్యాలు విద్యార్దులకు అందుబాటులో ఉన్నారని , పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ పాటశాలల్లో అత్యధిక విద్యార్థుల నమోదు కొరకు జూన్ 6 నుండి 19 వరకు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేయాలని ఆమె సూచించారు.

2024-25 విద్య సంవత్సరంలో జిల్లాలో చదివే 19,645 మంది పిల్లలకు ఒక జత ఉచిత ఏక రూప దుస్తులను మహిళ సంఘాల ద్వారా కుట్టించడం జరిగిందని వాటికోసం ప్రభుత్వం ఒక జత కు 75 రూపాయలు చెల్లించడం జరుగుతుందని జిల్లాలో మొత్తం
ఈ విద్య సంవత్సరంలో 1,71,150 ఉచిత పాఠ్య పుస్తకాలకు గాను 1,42,510 పాఠ్య పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, 95,913 ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాల కమీటీల ద్వారా మౌలిక వసతుల కల్పించడం కోసం జిల్లా లోని ప్రభుత్వ, లోకల్ బాడీ, కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ ఆదర్శ పాఠశాల, గురుకులలో 367 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ లను నూతనంగా నియమించి మౌలిక వసతుల కల్పన కొరకు సుమారు రూ. 6.91 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. అదే విధంగా ఐటీడీఏ పరిధిలోని 99 ట్రైబల్ వెల్ఫేర్ ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఇట్టి పనులను చేపట్టడం జరుగుతుందని అందులో భాగంగా నేటి వరకు 256 పాఠశాలల్లో ఎంపిక చేసిన అన్ని రకాల పనులు పూర్తి చేస్తున్నాం అని పాఠశాలలో 95% పనులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ విద్య సంవత్సరంలో పాఠశాలలకు 6268 డ్యుయల్ డెస్క్ లు, 449 గ్రీన్ చాక్ బోర్డు లు అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్దులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి లక్ష్య సాధనకు కృషి చేసి తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా విద్యను అభ్యసించాలని విద్యార్దులకు కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి,డి ఈ ఓ పాణిని, డీఎస్పీ రవీందర్, మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ శోభారాణి, ఎం ఈ ఓ లు, విద్యార్థిన, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking