రామగుండం పోలీస్ కమీషనరేట్ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రారంభించిన సీపీ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 02 : సైబర్‌ మోసగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల వెలుసుబాటు కోసం బాధితులు నేరుగా ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ రామగుండం కమిషనరేట్‌లోనే ప్రత్యేక సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం రోజు రామగుండం కమీషనరేట్ లో రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్(ఐజీ)ఎం.శ్రీనివాస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ప్రారంభించడం జరిగింది అనిసైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పర్యవేక్షక అధికారిగా ఏసీపీ వెంకటరమణ,ఇన్‌స్పెక్టర్ కృష్ణ మూర్తి,01 హెచ్‌సీలు,07 మంది కానిస్టేబుళ్లు ఉంటారు.ఈ బృందం సైబర్ బాధితులకు సత్వర సహాయం అందించడం, సైబర్ క్రైమ్ కేసులు నమోదు చేయడం,దర్యాప్తు చేయడం మరియు నేరస్థులను అరెస్టు చేయడం జరుగుతుంది అన్నారు. ఈ స్టేషన్‌లో రూ.లక్ష నుంచి అంతకన్నా ఎక్కువగా సైబర్‌ నేరాలకు గురైతే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంటుంది. బాధితులు చేసిన ఫిర్యాదుపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేస్తామని, రూ.లక్ష కన్నా తక్కువగా ఉన్న సైబర్‌ నేరాలపై బాధితులు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయవచ్చని సైబర్‌ క్రైమ్‌ సీపీ తెలిపారు.సైబర్‌ మోసానికి గురైన వెంటనే బాధితులు 1930కి కాల్‌ చేయడం లేదా www.cybercrime. gov.in పోర్టల్‌లో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్, సైబర్ పిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking