ఘనంగా ప్రారంభమైన రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు.

పల్లె జనాన్ని విశేషంగా
ఆకట్టుకుంటున్న ఇస్లాంపూర్ రామప్ప గుట్ట దేవాలయం.
హాజరవుతున్న ప్రముఖులు భక్తులు.

మెదక్ తూప్రాన్ జనవరి 16 ప్రాజబలం న్యూస్:-

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ రామప్ప గుట్టపై వెలసిన స్వయంభు శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్ , పిఎసిఎస్ డైరెక్టర్ సంతోష్ రెడ్డి , ఆలయ కమిటీ సభ్యులు పండితులు ఆత్రేయ శర్మ సమక్షంలో దేవాలయంలో మంత్రం వద్ద పూజలు జరుగుతున్నాయి. ఉత్సవాలకు తాజ మాజి ఎప్డీసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్ , బిజెపి నాయకులు మురళీధర్ యాదవ్ , జర్నలిస్టు గడ్డం ప్రశాంత్ కుమార్, రాజకీయ ప్రముఖులు ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల మంత్రోత్సవాల మధ్య స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ సుకన్య రమేష్, డైరెక్టర్ సంతోష్ రెడ్డి, మధుసూదన్ గౌడ్ , నరేష్ పటేల్ మాట్లాడుతూ
గుట్ట మధ్యలో వెలిసిన
స్వయంభూ శివలింగం
మహిమాన్విత ప్రదేశంగా ప్రసిద్ధి
ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, ఎత్తయిన గుట్టలు,
మరోవైపు దట్టమైన అడవి దాని మధ్యలో విశాలమైన బల్ల పరుపు బండపై స్వయంగా ఉద్భవించిన శివలింగం.. అయోధ్య శ్రీరాముడు భద్రాచలం వెళుతూ మార్గమధ్యంలోని ఈ గుట్ట పైన కాలు మోపి సేద తీరినట్లు అనవాళ్లు ఉండడంతో రాముడు పాదం మోపడం వల్ల ఈ గుట్టకు రామప్ప గుట్టగా, స్వయంగా ఉద్భవించిన శివలింగాన్ని రాముడు దర్శించడం వల్ల రామలింగేశ్వర స్వామిగా నామ కరణంతో గుట్ట ప్రసిద్ధి చెందింది.మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ గ్రామ శివారులో ఉన్న రామప్ప గుట్టపై ప్రతి ఏటా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని మూడు రోజులపాటు జాతర ఉత్సవాలు జరగడం పూర్వకాలం నుండి అనవాయితీగా వస్తోంది. ఈ ప్రాంతంలో కోరిన కోరికలు నెరవేరే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఈ రామప్ప గుట్టకు గొప్ప పేరు ఉంది. ఈ గుట్టపై మూల విరాట్ రామలింగేశ్వర స్వామి ఆలయం ఏర్పాటు మొదలుకొని గుట్ట కింది భాగంలో ఉన్న కోనేరులో ఎప్పటికీ నీళ్లు నిలువ ఉండడం, మరోవైపు గుట్ట అడుగు భాగంలో సొరంగ మార్గం ఉండడం వరకు అన్నీ ప్రత్యేకతలు మహిమలే కనిపిస్తుంటాయి. పూర్వకాలంలో మునీశ్వరులు ఇక్కడ గుట్టపైన తపస్సు చేసే వారని, దగ్గరలోని రామప్ప చెరువులో స్నానాలు చేయడం కోసం ఈ సొరంగ మార్గాన్ని మునీశ్వరులు ఏర్పాటు చేసుకున్నట్లు చరిత్ర చెబుతోంది. మునీశ్వరులు తపస్సు చేసిన ప్రదేశంలో ఇప్పటికీ
ఐదు అడుగుల ఎత్తులో వాల్మీకం పుట్ట కనిపిస్తుంది. రామ లింగేశ్వర స్వామి ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతుంటాయి. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రామాలయం పున నిర్మాణం జరిగింది. దాతల విరాళాలతో వినాయ కుని గుడి నవగ్రహాల గుడి నిర్మించబడింది. ముఖ్యమైన ఆలయాలకు తోడుగా ఇక్కడ ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతి వనంలోని పచ్చని చెట్లు పూల మొక్కలతో రామప్ప గుట్టకు మరింత ఆకర్షణను తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం సంక్రాం తి పండుగ పురస్క రించుకొని వరుసగా మూడు రోజులపాటు రామప్ప గుట్టపై జాతర ఉత్సవాలు కొనసాగుతున్నాయి ప్రధా నంగా గ్రామీణ ప్రాంతం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్న రామలింగేశ్వర స్వామి గొప్ప మహిమాన్విత దేవుడిగా కొనియాడ బడుతున్నాడు.
ధ్వజారోహణం అంకురార్పణం దీప స్థావన రామలింగేశ్వర స్వామికి అభిషేకం సాయంత్రం పూట ఇస్లాంపూర్ గ్రామస్తులచే ఎడ్ల బండ్ల ఊరేగింపు మంగళవారం ఇస్లాంపూర్ గ్రామంలో గోపాల కాల్వల వేడుక పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహంతో పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది. బుధవారం గుట్టపైన స్వామివారి రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నీటి వసతిని కల్పిస్తున్నట్లు జాతర నిర్వాహకులు తెలిపారు. గొప్ప చరిత్ర కలిగిన రామప్ప గుట్ట పై రాష్ట్ర ప్రభుత్వం సరైన దృష్టిని పెడితే ఇది ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా వెలుగొందే అవకాశాలు బాగా ఉన్నాయి. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ గుట్టను మరింత. అందంగా ఆకర్షనీయంగా తీర్చిదిద్ది పర్యాటక శోభను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఇస్లాంపూర్ గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking