ప్రజాబలం సినిమా ప్రతినిధి:శుక్రవారం రోజు రిలీజ్ అయిన ప్రేమ్ కుమార్ చిత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ లో దేవి థియేటర్ 70 ఎంఎం లో విడుదల అయ్యింది. ప్రేమ్ కుమార్ సినిమాలోని నటి రాసి సింగ్ తన తల్లి స్నేహితురాలు రేష్మి తో కలిసి దేవి సినిమా థియేటర్లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఆటకు రావడం జరిగినది. తన ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వందలాదిమంది ఫాన్స్ థియేటర్లో సందడి చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డప్పులతో పాటు పటాకులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోయిన్ రాసిసింగ్ మాట్లాడుతూ ప్రేమ్‌కుమార్ సినిమాని విజయవంతం చేయాలని కోరారు. దేవి థియేటర్ 70 ఎంఎం లో నన్ను ఆదారించిన అభిమానులకు స్వాగతం పలికిన చిత్ర విజయానికి కృషిచేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సినీ నటి రాశి సింగ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చిన్న యాదవ్ శివ లంబు రెడ్డప్ప అనిల్ గౌడ్ భీమ్సేన్ రావు మోహన్ రామిని రాజేష్ సత్యనారాయణ పాల్గొన్నారు.