రాజ్ న్యూస్ లో రవిప్రకాష్ VS బీజేపీ

  • రెండురోజుల్లోనే ఎన్నో మలుపులు, మరెన్నో లుకలుకలు
  • ఒకవర్గాన్ని పంపించేందుకు మరోవర్గం ఎత్తులు పై ఎత్తులు
  • కేసీఆర్ ను కొట్టడానికి మళ్లీ ఆంధ్రా మీడియా పురుడుపోసుకుంటుందా?
  • కేసీఆర్ పై గుడ్డి విమర్శలు చేస్తూ, కుట్రలు పన్నడానికి, వాళ్ళ వ్యతిరేకతను చాటడానికి ఆంధ్రాకమ్మలు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 3 ఛానళ్లు లీజుకు తీసుకుంటున్నారా?
  • ఇక ఈ శక్తులు తెలంగాణా మీడియాను, జర్నలిస్టులను బతకనీయరా?

రాజ్ న్యూస్ లో రవిప్రకాష్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే ఎన్నో మలుపులు, మరెన్నో పరిణామాలు చోటుచేసుకుంటూ అక్కడి లుకలుకలను బట్టబయలుచేస్తున్నాయి. తాజా ఇన్వెస్టర్ నరోత్తంరెడ్డి కజిన్ లింగారెడ్డిని నిన్న ఛానల్ ఎండీ కం ఎడిటర్ ఇన్ చీఫ్ చేయడంపట్ల రవిప్రకాష్ హర్ట్ అయ్యాడని తెలుస్తోంది. మేనేజ్మెంట్ పై కినుకవహించి 15 నిమిషాల్లోనే అక్కడి నుంచి ఆయన రుసరుస వెళ్ళిపోయినట్లు సమాచారం. లింగారెడ్డి జర్నలిస్టా కాదా అని రవిప్రకాష్ ఆరా కూడా తీసినట్లు వినికిడి.

అటు మేనేజ్మెంట్ తో రవిప్రకాష్ మనుషులు (నర్సింహరెడ్డి, హరిప్రసాద్) చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. చైర్మన్, సీఈఓ ఇవ్వం అని కొత్త మేనేజ్మెంట్ రవిప్రకాష్ కు ముందే తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఐతే, కనీసం ఎడిటర్ ఇన్ చీఫ్ ఐనా ఇవ్వకపోతారా అని ఆయన వర్గంలో అందరూ ఆశించారు. కానీ, ఆయన వచ్చేటప్పటికే, కనీసం ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడే డిసైడ్ చేసి లింగారెడ్డిని ఎడిటర్ ఇన్ చీఫ్ గా ప్రకటించారు. దీంతో రవిప్రకాష్ మరి నేనేంటి ఇన్ పుటా ఔట్ పుటా అనే భావనలో ఉన్నట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.

మరోవైపు రవిప్రకాష్ ను ఛానల్లోకి రానీయకుండా నరోత్తంరెడ్డి, ఇతర స్థానిక బీజేపీ లీడర్లు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అక్కడి వర్గాలు అంటున్నాయి. రవిప్రకాష్ జాతీయ బీజేపీతో మాట్లాడుకుని లైన్ క్లియర్ చేసుకుంటే, లోకల్ లీడర్లు మాత్రం అడ్డుపడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఆయనను పొమ్మనలేక లింగారెడ్డిలాంటి వాళ్ళను పెట్టి అవమానపరుస్తున్నారని చర్చ జరుగుతోంది.

గతంలో మోజో ఛానల్లో పనిచేసిన అనుంగు అనుచరులు యాంకర్ రఘు, రిపోర్టర్ నరసింహారెడ్డిలు ఇద్దరూ రవిప్రకాష్ తరఫున రాజ్ న్యూస్ లో జాయిన్ అయ్యారని తెలుస్తోంది. రవిప్రకాషే ఛానల్ టేకోవర్ చేసేలా మరో ప్లాన్ నడుస్తోందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ మేనేజ్మెంట్ వాళ్ళందరినీ వెళ్లగొట్టాలని రవిప్రకాష్ స్కెచ్ గీస్తున్నట్లు సమాచారం. ఆ తరవాత బీజేపీ లేదు ఏంలేదు అంతా యాంటీ కేసీఆరే అన్నట్లు ఛానల్ నడపాలని వ్యూహం. బీజేపీ జాతీయ విధానాలకు మాత్రం తన ఆధ్వర్యంలోని రాజ్ న్యూస్ లో పాజిటివ్ స్టోరీలు ఉండే విధంగా, మిగిలిన కంటెంట్ అంతా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉండేలా ఛానల్ నడపాలనే భావనలో రవిప్రకాష్ ఉన్నట్లు సమాచారం. ఈ ఒక్క ఛానలే కాదు ఇంకా మరొక రెండు ఛానళ్లు (భారత్ టుడే, స్టూడియో ఎన్) లీజుకు తీసుకొని యాంటీ కేసీఆర్ నడిపించడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను జొప్పించాలనే ప్రయత్నంలో రవిప్రకాష్ ఉన్నట్లు వినికిడి.

వాస్తవానికి ముందుగా ఎస్ (S) టీవీ అనుకున్నారు కానీ, దానిపై కేసులు గట్రా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం స్టూడియో ఎన్ లో ఉన్న ఎక్విప్మెంట్ సమాచారం అంతా సేకరిస్తున్నారు. ఒకే ఛానల్లో కేసీఆర్ వ్యతిరేక వార్తలు వేస్తే నమ్మరు. అట్లా కాకుండా ఒక 3, 4 ఛానళ్ళలో అవే వార్తలు రావడం ద్వారా ప్రజలు ఇదే నిజం అని నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది రవిప్రకాష్ వ్యూహమని తెలుస్తోంది. యాంటీ కేసీఆర్ వేగాన్ని తట్టుకోలేని వాళ్ళందరూ ఎగిరిపోతారు, యాంటీ కేసీఆర్ ఎజెండా వేగాన్ని అందుకున్నోళ్లు మిగిలిపోతారని రవిప్రకాష్ స్వయంగా అంతరంగికులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking