పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసిన రాయల నాగేశ్వరరావు

 

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీగా హైదరాబాద్ తరలివచ్చి దరఖాస్తు

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 24 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కోసం టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు హైదరాబాద్ గాంధీ భవన్ లో దరఖాస్తు చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలుతన అభిమానులతో హైదరాబాద్ తరలి వెళ్లిన ఆయన 50 వేల దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ దాఖలు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయన్నారు కేసీఆర్ ఎన్ని మాయ మాటలు చెప్పిన ప్రజలు నమ్మడం లేదన్నారు పాలేరు లోనే పుట్టి పెరిగిన తనను పాలేరు ప్రజలు అత్యధిక మెజారిటీ గెలిపిస్తారన్నారు ఎన్ని కష్టాలు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేశానని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క కళ్లెం వెంకటరెడ్డి బచ్చలకూర నాగరాజు అంజి ఎడవెల్లి నాగరాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking