అయోధ్యలో రామ విగ్రహ పునః ప్రతిష్ట మహోత్తర ఘట్టం

-సినీ రచయిత చిన్ని కృష్ణ

భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి పున ప్రతిష్టాపన చేయడం మహోత్తరమైన ఘట్టమని రామభక్తుడు, సినీ రచత చిన్ని కృష్ణ పేర్కొన్నారు.భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించిన శ్రీరామచంద్రుని మందిరాన్ని దుష్టుడైన బాబర్ కూల్చి వేసి లక్ష 75 వేల రామ భక్తుల మరణానికికారణమయ్యాడన్నారు. ఈ దుర్ఘటన జరిగిన ఐదు వందల సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ట చెయ్యడాన్ని యావత్ దేశ ప్రజలు వీక్షించి దేవుడి కృపకు పాత్రులు కావాలని అన్నారు. దేశ చరిత్రలోనే నరేంద్ర మోడీ మిగిలిపోతారని అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్టతో రామభక్తుల శాంతించి నరేంద్ర మోడీ చేసిన ఈ సాహసానికి ప్రజలందరూ రామరాజ్య స్థాపనకు నడుం బిగించాలని కోరారు. రాబోవు ఎన్నికలలో 400 పైచిలుకు ఎంపీ స్థానాలు మోడీ నేతృతంలోని బిజెపి కైవసం చేసుకుంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking