ప్రశంసా పత్రం పొందిన రేగళ్ల లాస్య

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం) ఖమ్మం శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా దేవస్థానం నందు కళ, సాంస్కృతిక , ఆరోగ్య వేదికగా నాట్య ప్రదర్శన చేయుటకు పలు రాష్ట్రాల నుండి వచ్చిన చిన్నారులు, ఇందులో భాగంగా “లలిత అకాడమి” పేరిణి నాట్యం వీరు నాయక్ మాస్టారు ఆధ్వర్యంలో చక్కటి నాట్య ప్రదర్శన చేశారు ఇందులో ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపుడి గ్రామనికి చెందిన రేగెళ్ల వెంకటేశ్వరావు – కృష్ణకుమారి ల కుమార్తె అయిన చిరంజీవి రేగళ్ల లాస్య (గూగుల్ కిడ్స్ స్కూల్ నందు 5వ తరగతి చదువుతున్నది). చక్కటి ప్రదర్శన ఇచ్చి అందరి మనస్సును ఆకట్టుకుంది. ఈ చిన్నారి గతంలో చాలా నాట్య ప్రదర్శన లో పాల్గొని ప్రశంశ పత్రాలు, షిల్డ్స్ అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా చిన్నారిని కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజలు అభినందించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking