అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2 లక్షకు పెంచాలని 4 వా రోజుకు చేరిన రిలే నిరాహార దీక్ష

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..65 సంవత్సరాల పైబడిన అంగన్వాడీ టీచర్లుకు 2 లక్షలు, హెల్పర్ కు లక్ష రూపాయలు, జీతంలో సగం పెన్షన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ఆర్ డి ఓ.కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 4 రోజు చేరాయి.
కొత్త జీ ఓ వచ్చే వరకు పాత జీ ఓ ప్రకారం చేస్తున్న రిటైర్మెంట్ ప్రక్రియ ను అపాలి అని తాజా గా జూన్ 29 న విడుదల చేసిన మెమో నెంబర్ 1334 ను ఉపసంహరించుకొని 65 సంవత్సరాలు దాటిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలి అని మంత్రి సీతక్క ను అంగన్వాడీ లు కోరారు. అదేవిధంగా జీతం లో సగం పెన్షన్ గా ఇవ్వాలి అని కూడా అంగన్వాడీ లు మంత్రికి విన్నవించుకున్నారు.
రాజమణి అధ్యక్షులు అంగన్వాడీ యూనియన్ యూనియన్ నాయకులు మాట్లాడుతు
మెమో నంబర్ 1334 ను ఉపసంహరించుకొని 65 సంవత్సరాలు దాటిన వారిని కొత్త జీ ఓ వచ్చే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాజమణి అంగన్వాడీ నాయకులు తులసి,వనజ, భాగ్య అనురాధ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking