మడిపల్లి చెరువు గండి పూడ్చాలని తహసిల్దార్ కు వినతి

-కబ్జాకు గురి అయిన భూమిని వెనక్కి కాపాడాలి

-మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకమళ్ల అశోక్

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి సెప్టెంబర్ 4

జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామ పెద్ద చెరువు మడిపల్లి అంకుశపూర్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న చెరువు దొరల హయాంలో అమాయక రైతులకు అమ్మి వాటిని పట్టా భూములుగా మార్చటం జరిగిందని. చెరువు ను కొన్నటువంటి అమాయక రైతులు మావి పట్టా భూములని మేము వ్యవసాయం చేసుకుంటామని అధికారులను తప్పుదోవ పట్టిస్తూ చెరువు నిర్మాణం జరిగినప్పుడు ఉన్నటువంటి తూము ఉండగా గత ప్రభుత్వ పెద్దల సహకారంతో ప్రత్యేకంగా అంకుషాపూర్ రోడ్డున చెరువుకు పెద్ద గండి పెట్టి చెరువులో చుక్క నీరు కూడా ఉండకుండా చేస్తున్నటువంటి దుస్థితి మడిపల్లి చెరువుకు ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నప్పటికీ చెరువులు కుంటలు నిండి జలకలాడుతూ ఉంటే మడిపల్లి చెరువు మాత్రం విలవిల వాడిపోతున్నది. దీనంతటికీ కారణం ప్రత్యేకంగా చెరువుకు గండిపెట్టి పడ్డ నీరు పడ్డట్లే పోయేటట్లుగా అధికారులతో కుమ్మక్కై చేసినటువంటి పరిస్థితి. దీన్ని గ్రహించినటువంటి రైతుల సంక్షేమం కోసం మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మేకమళ్ళ అశోక్ బుధవారం జమ్మికుంట తహసిల్దార్ రమేష్ బాబుకి వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా నూతనంగా చెరువుకు పెట్టినటువంటి గండిని పూడ్చాలని, అమాయక రైతుల నుండి కబ్జాకు గురి అయిన చెరువు భూమిని స్వాధీనం చేసుకోవాలని అవసరమైతే హైడ్రా చట్టాన్ని ఉపయోగించుకోవాలని తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఒకవేళ తక్షణ చర్యలు తీసుకోనట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking