రెజొనెన్స్‌ శ్రీనగర్‌ ‘‘విద్యార్థుల పిక్‌నిక్‌’’

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం స్థానిక శ్రీనగర్‌కాలనీలోని రెజొనెన్స్‌ స్కూల్‌ విద్యార్థుల విహారయాత్ర మరియు కార్తీకమాస వనసమారాధనను పాఠశాల డైరెక్టర్స్‌ కొండా శ్రీధర్‌రావు మరియు కొండా కృష్ణవేణి గార్లు విద్యార్థుల కేరింతల నడుమ భక్తి ప్రపత్తులతో ఘనంగా ప్రారంభించి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమములో స్కూల్‌ డైరెక్టర్‌ కొండా శ్రీధర్‌రావు పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులలో సృజనాత్మకతను, మానసికోల్లాసాన్ని పెంపొందించే ఉద్ధేశ్యంతో చెరుకూరి గార్డెన్స్‌లో విహారయాత్రను నిర్వహించామని, కార్తీక మాసంలో ఇలాంటివి ఏర్పాటుచేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, విద్యార్థులను తరగతి గదులకే పరిమితం చేయకుండా శారీకర, మానసిక ఉల్లాసం కోసం, కలసిమెలసి ఉండటం, ప్రకృతిని ఆరాధించటం వంటి విషయాలపై అవగాహన కలిగించటం కోసం రెజొనెన్స్‌ స్కూల్‌ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తుందని తెలియజేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసారు డైరెక్టర్‌ కొండా కృష్ణవేణి పాల్గొని, మాట్లాడుతూ రెజొనెన్స్‌ స్కూల్‌ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా నాణ్యమైన విద్యతోపాటు పిక్‌నిక్‌లు, ఫీల్డ్‌ ట్రిప్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ నిరతంరం మంచి ప్రణాళికలతో విద్యార్థులను విజ్ఞానవంతు లుగా చేస్తున్నామని తెలియజేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహం గా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు చిన్నారులకు వివిధ రకాల క్రీడలను నిర్వహించారు. స్వేచ్చా ప్రపంచంలోకి అడుగుపెట్టిన పిల్లలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. పిల్లలు ప్రదర్శించిన నృత్యాలతో, ఆటపాటలతో, కేరింతలతో కార్యక్రమం ఆధ్యంతం ఆనందభరితంగా, ఎంతో ఉల్లాసంగా సాగింది. ఆటలలో గెలిచిన విద్యార్థులకు బహుమతులను అందించి ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ యం.ప్రసన్నరావు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking