వడ్లు దించుకోకుండా అడ్డుకుంటున్న రైస్ మిల్లర్లు రైస్ మిలర్స్ రైతులను ఇబ్బంది పెట్టొద్దు

 

రైస్ మిల్లర్స్ వడ్లను వెంటనే ఆన్ లోడ్ చేసుకోవాలి,లేకుంటే చట్టపరంగా చర్యలు చేపట్టాలి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 27 : మంచిర్యాల జిల్లాలోని రైస్ మిల్లర్లు కొనుగోలు కేంద్రంల్లోని వడ్లను వెంటనే ఆన్ లోడ్ చేసుకోవాలని,లేకుంటే చట్టప్రకారం వారి పై చర్యలు తప్పవని జిల్లా కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లను హెచ్చరించారు. సోమవారం ఎస్ పీ ఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ…మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే గా ప్రేమ్ సాగర్ రావు గెలిచినా కొన్ని రోజుల్లోనే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం కొనుగోలు కేంద్రాల్లో తూకంలో జరుగుచున్న మోసంపై దృష్టి సారించామన్నారు.తరుగు పేరిట గత తెరాస ప్రభుత్వం క్వింటల్ కు 5 నుండి 10 కేజీలు కటింగ్ ను లేకుండా కేవలం గోనె సంచి బరువు మాత్రమే కటింగ్ ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. వరి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొత్తం కొనుగోలు చేసి రైతులకు సకాలంలో డబ్బులు వారి అకౌంట్ లో పడేలా ప్రేమ్ సాగర్ రావు పూర్తి బాధ్యత చేపట్టారన్నారు.ఇది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్మాస్ కాంతయ్య అడ్డు పడుతున్నారన్నారు.వేసంగి ధాన్యంను రైస్ మిలర్స్ దించు కోకుండ వారిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు.కానీ ధాన్యం ఆన్ లోడ్ చెయ్యని రైస్ మిలర్స్ పై రాష్ట్ర ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు చేపడతారని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు,నలుమాస్ కాంతయ్యలు ప్రతి కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులను అడిగి తెలుసుకోవాన్నారు. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు లేకున్నా అసెంబ్లీలో సంబందించిన మంత్రితో మాట్లాడి యాసంగి పంటకు పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించామని,రైతులకు న్యాయం చేసిన ఘనత ప్రేమ్ సాగర్ రావుదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జిపీస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షుడు ఎండి అరిఫ్,మండల అధ్యక్షుడు పింగళి రమేష్, దండేపల్లి మండల అధ్యక్షుడు అక్కల వేంకటేశ్వర్లు,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్,తోట మోహన్,వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు నలిమేల రాజు,మున్సిపల్ కోఆప్షన్ సయ్యద్ షహీద్ అలీ,శ్రీధర్,అమీర్,అయిల్లా విజయ్,నవాబ్,అంకతి శ్రీనివాస్,చిన్న రమేష్,హాజీ, రాజేష్,రాజు,బనేశ్,రవీందర్, చుంచు నాగేష్,పయల్ శంకర్, హఫీజ్,రైతులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking