అధ్యక్ష ప్రధాన కార్యధర్సులు గా మెడిపెల్లి విజయ్.ముషం రమేష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 10 : మంచిర్యాల అర్బన్ మరియు టౌన్ ఆర్.ఎం.పి.పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ సీనియర్ వైద్యులు దొంతుల మొండయ్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఇందులో 2022 నుండి 2024 వరకు పాత కమిటీని డిసాల్వ్ చేసి తిరిగి నూతన కమిటికి ఎన్నికలు నిర్వహించారు.ఈ నూతన కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకోన్నారని సీనియర్ వైద్యులు మొండయ్య తెలిపారు. మంచిర్యాల పట్టణ అధ్యక్షులు గా మేడిపల్లి విజయ్,ప్రధాన కార్యదర్శిగా మూషం రమేష్,కోశాధికారి రాథోడ్ రామారావు ని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.ఈ యొక్క సమావేశంలో నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మేడిపల్లి విజయ్ మాట్లాడుతూ ఆర్.ఎం.పి,పి.ఎం పి,లు అందరూ తమ పరిధిలో ప్రథమ చికిత్స చేయాలని, యాంటీబయాటిక్స్ వాడకూడదు అని,పేషెంట్ కు రక్త పరీక్ష మూత్ర పరీక్ష అని పంపకూడదు అని సూచించారు.ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి గాని ప్రైవేట్ ఆసుపత్రికి గాని పేషెంట్ సూచన మేరకు పంపించగలరని తెలియజేసారు.మన ఆర్ ఎం పీ.లు పి ఎం పీ.లు కాంపౌండర్ వ్యవస్థను ప్రోత్సహించకూడదని గట్టిగా ప్రతి సభ్యుణ్ణి మందలించినట్లు తెలియజేసారు.ఈ సందర్భంగా పాత కమిటీ సభ్యులను సన్మానించారు. సబ్యులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ మరియు అర్బన్ ఆర్ ఎం పి.పి ఎం పి. లు పాల్గొన్నారు.